Header Banner

ఇల్లు లేని కుటుంబానికి ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు చలించిపోయారు! 4 నెలల్లోనే సొంత ఇంటి కల...

  Thu Feb 20, 2025 22:11        Politics

మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు తన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో.. ఓ కుటుంబం ఇల్లు లేక బాత్రూంలో నివసిస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడే వారికి కొత్త ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన తర్వాత 4 నెలల్లోనే.. వారికి అద్భుతమైన ఇంటిని కట్టించి.. గృహప్రవేశం కూడా చేయించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది.


ఇల్లు లేని వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. చాలా మంది నిరుపేదలు ఉండడానికి గూడు లేక.. రోడ్డు పక్కన జీవనం సాగిస్తూ ఉంటారు. ఏదో కొద్ది స్థలం ఉంటే అందులో గుడిసెలు వేసుకుని కాలాన్ని వెల్లదీస్తుంటారు. అయితే ఓ కుటుంబం ఇల్లు లేక.. బాత్రూంలో నివసిస్తోందని తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు.. వారి దీనస్థితిని చూసి చలించిపోయారు. ఎట్టి పరిస్థితుల్లో వారికి సొంతిల్లు కట్టిస్తానని భరోసా ఇచ్చారు. మాట ఇచ్చిన మర్నాడు నుంచే వారి సొంతింటి కలకు బాటలు పడ్డాయి. కేవలం 4 నెలల్లోనే ఇల్లు పూర్తి చేసి.. ఇంట్లోకి అడుగుపెట్టించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు చూపించిన దయా హృదయానికి స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 

 

సరిగ్గా 4 నెలల క్రితం.. అంటే గతేడాది సెప్టెంబర్ 25వ తేదీన మడకశిర మండలం హెచ్ఆర్‌హళ్ళిలో నరసింహప్పా అనే నిరుపేద కుటుంబాన్ని ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు కలిశారు. ఆ సమయంలో వారు తమ కష్టాలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. ఉండేందుకు కనీసం ఇల్లు లేక గత 7 ఏళ్లుగా బాత్రూంలోనే జీవిస్తున్నట్లు చెప్పడంతో అది విని.. ఎమ్మెల్యే చలించిపోయారు. ఈ క్రమంలోనే బాత్రూంలో ఉంటున్న నరసింహప్ప కుటుంబ పరిస్థితిని స్వయంగా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబానికి కొత్తగా ఇల్లు నిర్మించి ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


వెంటనే వారికి తక్షణ సాయంగా నరసింహప్ప కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయం అందించారు. వెంటనే ఆ బాత్రూంను ఖాళీ చేసి అద్దె ఇంట్లోకి వెళ్లి నివసించాలని వారికి ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు సూచించారు. అది జరిగిన ఒక్క రోజులోనే నరసింహప్ప కుటుంబానికి అదే హెచ్ఆర్ హళ్లి గ్రామంలో రెండు సెంట్లు స్థలాన్ని మంజూరు చేయించారు. ఆ తర్వాత తన సొంత డబ్బులతో వారికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని.. ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


నరసింహప్ప కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు.. 4 నెలల్లోనే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. దాదాపు రూ.6 లక్షల వ్యయంతో ఒక హాల్, బెడ్‌రూమ్, కిచెన్‌తో కూడిన ఇంటిని కట్టించి.. నరసింహప్ప కుటుంబానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఇంటి తాళాలు అందించారు. అనంతరం కొత్త ఇంట్లో పూజలు చేసి.. పాలు పొంగించి.. నరసింహప్ప కుటుంబంతోపాటు ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు గృహప్రవేశం చేశారు. అప్పటివరకు బాత్రూంలో జీవనం సాగించిన నరసింహప్ప కుటుంబానికి.. సొంత డబ్బులతో ఇల్లు కట్టించిన ఎమ్మెల్యేపై హెచ్ఆర్ హళ్లి గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఇక తమ కుటుంబ పరిస్థితిని చూసి.. అంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు నరసింహప్ప కుటుంబం ధన్యవాదాలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #chandrababu #pawankalyan #lokesh #naralokesh #appolitics #msraju #madakasira